Pendurthi: ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లికి వెళ్తుండగా బైక్‌ను ఢీకొట్టిన కారు

Pendurthi: గోపాలపట్నం రోడ్డులో ఘోర ప్రమాదం. పెళ్లికి వెళ్తుండగా బైక్‌ను ఢీకొట్టిన అజ్ఞాత కారు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 Aug 2026 12:33 PM IST
Pendurthi
X

Pendurthi: ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లికి వెళ్తుండగా బైక్‌ను ఢీకొట్టిన కారు

Pendurthi: గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ నుంచి వేపకుంట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే నాయుడు తోటలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో జరుగుతున్న ఒక వివాహానికి హాజర య్యేందుకు జస్వంత్‌ (24), రిజ్వాన్‌ (24) అనే ఇద్దరు యువకులు బైక్‌పై బయలు దేరారు వారు ప్రధాన రహదారిపై వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని కారు వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరా రయ్యాడు.

ఈ ప్రమాద తీవ్రతకు రిజ్వాన్‌కు శరీరంలో పలుచోట్ల తీవ్ర గాయాలు కాగా, జస్వంత్‌ చేతికి బలమైన గాయమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పెందుర్తి ట్రాఫిక్‌ పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి, అంబులెన్స్‌లో స్థానిక బెహరా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర చికిత్స అందుతోంది.

బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్ళిపోయిన ఆ అజ్ఞాత కారును గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story