Anakapalli: అనకాపల్లి నియోజకవర్గానికి రూ.17.67 కోట్ల పల్లె పండుగ నిధులు
Anakapalli: అనకాపల్లి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి 'పల్లె పండుగ 3.0' కింద రూ.17.67 కోట్లు మంజూరైనట్లు కూటమి నాయకులు తెలిపారు.
Anakapalli: అనకాపల్లి నియోజకవర్గానికి రూ.17.67 కోట్ల పల్లె పండుగ నిధులు
Anakapalli: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు పడింది. ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గానికి మొత్తం రూ.17.67 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అనకాపల్లి, కశింకోట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ, బీటీ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు.
నియోజకవర్గ అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేస్తున్న కృషి ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వ సహకారంతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.
అనకాపల్లి మండలంలో గొలగాం, చింతనిప్పుల అగ్రహారం, కొత్తూరు, తుమ్మపాల, కుంచంగి, కుండ్రం, సుందరయ్యపేట, మారేడుపూడి, శంకరం, మామిడిపాలెం, గోపాలపురం, పాపయ్యసంతపాలెం, పాపయ్యపాలెం, సత్యనారాయణపురం, అక్కిరెడ్డిపాలెం, మార్టూరు, మాకవరం, బవులవాడ, ఆర్.వి.పాలెం, తగరంపూడి, మెట్టపాలెం, కోడూరు, సీతానగరం, వెంకుపాలెం, కొండుపాలెం, సంపతిపురం, పిసినిడికాడ, రేబాక, ఊడేరు, దిబ్బపాలెం తదితర గ్రామాలకు నిధులు కేటాయించారు.
అదేవిధంగా కశింకోట మండలంలో కశింకోట, సుందరయ్యపేట, అచ్చెర్ల, ఏ.ఎస్.పేట, బుచ్చెయ్యపేట, చరకాం, చింతలపాలెం, ఈ.చౌడువాడ, జి.భీమవరం, గొబ్బూరు, జమాదులపాలెం, కొత్తపల్లి, మోసాయిపేట, వెదురుపర్తి, తీడ, పరవాడపాలెం, పేరంటాలపాలెం, తేగడ, ఉగ్గినిపాలెం, విసన్నపేట, వై.తుని, జెడ్.తుని, నూతనగుంటపాలెం, అడ్డం తదితర గ్రామాల్లో రహదారి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. కొన్ని గ్రామాలకు అదనపు నిధులు కూడా మంజూరయ్యాయి.
గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు కావడం పట్ల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిధుల సాధనకు కృషి చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదరం నాగేశ్వరరావు, కర్రి వెంకట సన్యాసినాయుడు (బాబీ), కర్రి సత్యనారాయణ, గంగూపాం జగదీష్, బంటు రవి, కొసిరెడ్డి త్రినాథ్, జ్యోతుల గణేష్, కరణం రాము, బొబ్బాది రమణ, ఆళ్ల శ్రీను, గొర్లి శ్రీను, బోండా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.




