Visakhapatnam: విశాఖ దక్షిణంలో SL కెనాల్‌కు రూ.18 కోట్లు మంజూరు!

Visakhapatnam: విశాఖ దక్షిణంలో ఎస్‌ఎల్‌ కెనాల్ ఆధునీకరణకు రూ.18 కోట్ల అనుమతులు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 27 Aug 2026 9:06 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ దక్షిణంలో SL కెనాల్‌కు రూ.18 కోట్లు మంజూరు!

Visakhapatnam: ప్రభుత్వ పెద్దలతో, పోర్టు, జీవీఎంసీ అధికారులతో నిరంతర సమన్వయంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌ కెనాల్ ఆధునీకరణ పనులకు రూ.18 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు కావడంతో నియోజకవర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి., ఎస్‌ఎల్‌ కెనాల్ ఆధునీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరంతరం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA), జీవీఎంసీ అధికారులతో చర్చిస్తూ చొరవ చూపడంతో కీలక పనులకు పరిపాలనా అనుమతి లభించింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story