Sabbavaram: అభివృద్ధి బాటలో ఆరిపాక.. అంతకాపల్లి: ఎంపీ సీఎం రమేష్

Sabbavaram: సబ్బవరం మండలం ఆరిపాక, అంతకాపల్లి గ్రామాల్లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రూ.2.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

GOPI, PENDURTHI
Published on: 11 Oct 2026 5:47 PM IST
Sabbavaram
X

Sabbavaram: అభివృద్ధి బాటలో ఆరిపాక.. అంతకాపల్లి: ఎంపీ సీఎం రమేష్

సబ్బవరం: గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సబ్బవరం మండలం ఆరిపాక, అంతకాపల్లి గ్రామాల్లో ఆదివారం సుమారు రూ.2.20 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చొక్కాకుల వెంకటరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. గోటివాడ శ్రీ దామోదర లా కాలేజీ నుంచి ఆరిపాక వరకు ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను అభినందిస్తూ కూటమి నాయకులు సేవా సంకల్ప యాత్ర నిర్వహించారు.

అంతకాపల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

అనంతరం రాములమ్మపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చొక్కాకుల వెంకటరావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంతకాపల్లి పంచాయతీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను నాయకులు ప్రజలకు వివరించారు.

కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలో సుమారు రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని స్థానిక నాయకులు పేర్కొన్నారు.

ప్రజల్లో ఉండే నాయకులకే ఆదరణ

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకులను ప్రజలు ఆదరిస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, సబ్బవరం మండలంలోని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఎంపీ సీఎం రమేష్ అందిస్తున్న సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేసే నాయకులకు ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాజీ అధ్యక్షుడు చొక్కాకుల గోవింద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, యువ నాయకుడు గండి వంశీ, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ బలిరెడ్డి అప్పారావు, మండల ప్రజా పరిషత్ అధికారి పద్మజ, మండల రెవెన్యూ అధికారి అరుణ్ చంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI