Vizag: రాజకీయాలకు అతీతంగా కేఎన్ఆర్ ట్రస్ట్ సేవలు

Vizag: విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ కందుల నాగరాజు కేఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా పేద నవ వధువులకు బంగారు తాళిబొట్లు, పట్టు వస్త్రాలు పంపిణీ చేశారు.

GOPI, PENDURTHI
Published on: 27 April 2026 6:01 PM IST
Vizag
X

Vizag: రాజకీయాలకు అతీతంగా కేఎన్ఆర్ ట్రస్ట్ సేవలు

Vizag: విపత్కర పరిస్థితుల్లో సాటి వారికి సహాయం చేయడమే మానవత్వమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, 32 వ వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందులు నాగరాజు అన్నారు. కె ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న నిర్విరామ సేవా కార్యక్రమాలలో భాగంగా సోమవారం పలు కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా నవ వధువులైన

32 వ వార్డు అల్లిపురం చలువతోట ప్రాంతానికి చెందిన పి.రమ్య, 34 వ వార్డు నేతాజీ నగర్ ప్రాంతానికి చెందిన ఎం. నిత్య సంతోషి, భూపేష్ నగర్ ప్రాంతానికి చెందిన నీరజలకు బంగారు తాళిబొట్లు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు, వ్యాపారవేత్త సందీప్ జైన్ లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ మానవత్వంతో సాయం చేయడం అంటే నిస్వార్ధంగా అవసరములో ఉన్న వారిని ఆదుకోవడం అని చెప్పారు. కష్టాల్లో ఉన్న వారిని, సహాయం అవసరమైన వారిని ఆదుకోవడం ద్వారా మనిషి పై నమ్మకాన్ని పెంచువచ్చని చెప్పారు.

సాటి మనుషులకు కష్ట కాలంలో చేయూతనివ్వడమే నిజమైన మానవత్వం అని పేర్కొన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ స్ఫూర్తిదాయక సేవలు అందిస్తూ ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతున్న గొప్ప వ్యక్తి డాక్టర్ కందుల నాగరాజు అని కొనియాడారు.

రాజకీయాలకు అతీతంగా ఎంతో మందికి సేవలు అందిస్తూ, అందరికీ ఆత్మీయుడుగా మారారని ప్రశంసించారు. మానవత్వంతో ఆయన చేస్తున్న సేవలు ఆయన మంచి వ్యక్తిత్వానికి నిదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త సందీప్ సందీప్ జైన్ , కందుల కృష్ణ , అదిబాబు , సిపిఐ బుజ్జి , నాగమణి , శ్రీదేవి , వర , కోదండమ్మా , దేవి , రావణమ్మ , కుమారి తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story