Narsipatnam: నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్‌లో సిబ్బంది కొరత!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. 7 కానిస్టేబుల్ పోస్టులకు గాను ఒక్కరే పనిచేస్తుండటం.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 3 Sept 2026 2:30 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్‌లో సిబ్బంది కొరత!

Narsipatnam: స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో సిబ్బంది కొరత తీవ్రంగా వుంది. మొత్తం ఏడుగురు కానిస్టేబుళ్లకుగాను ప్రస్తుతం ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రమే వున్నారు. ఈ స్టేషన్ పరిధిలో నర్సీపట్నం, రోలుగుంట, మాకవరపాలెం, కోటవురట్ల మండలాలు ఉన్నాయి. వాస్తవంగా ఒక సీఐ, ఒక ఎస్ఐ, ముగ్గురు హెడాకానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉండాలి. సీఐ, ఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్లు వున్నప్పటికీ కానిస్టేబుల్ ఒక్కరే వున్నారు.

మొత్తం మీద ఆరు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా వున్నాయి. కానిస్టేబుళ్ల కొరత కారణంగాబైండోవర్లు, నిందితులను కోర్టులో హాజరుపరచడానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మద్యం షాపుల పర్యవేక్షణ, సారా నిర్మూలన, స్టేషన్లో కాపలా విధులను సీఐ, ఎస్ఐ, హెచ్సీలే చూసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం షాపుల సమయపాలన పర్యక్షణ కోసం ఉదయం షాపు తెరవక ముందు ఒకసారి, రాత్రి మూసిన తర్వాత ఒకసారి ఎక్సైజ్ సిబ్బంది ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి.

నవోదయ-2 కార్యక్రమంలో భాగంగా సారా తయారీ, విక్రయాలు, రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అపరిష్కృతంగా పాత గంజాయి కేసులు త్వరగతిన పరిష్కారించాలి. ఈ పనులన్నీంటిని ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు హెచ్సీలు, ఎస్ఐ చేయాల్సి వస్తున్నది. దీనివల్ల వారిపై పనిఒత్తిడి పెరిగింది. కొన్నిసార్లు పెండింగ్లో ఉన్న గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా వున్న ఆరు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని మిగిలిన సిబ్బంది కోరుతున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story