Visakhapatnam: సింహాచలంలో ఘనంగా అప్పన్న స్వామికి స్వర్ణ సంపెంగ అర్చన!

Visakhapatnam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం స్వర్ణ సంపెంగ పుష్పార్చన వైభవంగా జరిగింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 27 Aug 2026 9:33 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: సింహాచలంలో ఘనంగా అప్పన్న స్వామికి స్వర్ణ సంపెంగ అర్చన!

Visakhapatnam: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి సింహాచలం ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.. స్వామికి ప్రీతి పాత్రం అయిన స్వర్ణ సంపెంగ పూల అర్చనలు చేశారు.

ప్రతి గురువారం సింహాచల క్షేత్రంలో అప్పన స్వామి ఇష్టం అయిన స్వర్ణ సంపెంగ పుష్పార్చన వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి స్వర్ణ పుష్పార్చన సేవలో పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.

సింహాద్రి అప్పన్న కి చందనం ఎంత ప్రీతికరము, సంపెంగ సువాసనలు అంతే ప్రీతి కావడం తో ప్రతి గురువారం సింహాచలంలో స్వర్ణ సంపెంగ అర్చనలు జరుపుతారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story