Bheemili: శ్రీ పరదేశమ్మ దేవాలయ భూమి పూజలో పాల్గొన్న సిరమ్మ!

Bheemili: భీమిలి 4వ డివిజన్ చేపల ఉప్పాడలో శ్రీ పరదేశమ్మ దేవత ఆలయ భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొన్నారు.

SHIVA, BHIMILI
Published on: 26 Aug 2026 4:34 PM IST
Bheemili
X

Bheemili: శ్రీ పరదేశమ్మ దేవాలయ భూమి పూజలో పాల్గొన్న సిరమ్మ!

Bheemili: భీమిలి నియోజకవర్గం , భీమిలి 4 డివిజన్, చేపల ఉప్పాడ, పెద ఉప్పాడ లో శ్రీ పరదేశమ్మ దేవతా పుణ్యక్షేత్రం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగినది.

వారి ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌ!! శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొని పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో భీమిలి 4వ వార్డు మాజీ కార్పొరేటర్ కొండ బాబు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story