visakhapatnam: విశాఖలో 'ఏఐ ఫ్యూజన్' సదస్సులో పాల్గొన్న సీతం బృందం!
visakhapatnam: విశాఖపట్నంలో జరిగిన 'ఏఐ ఫ్యూజన్ వైజాగ్' సదస్సులో పాల్గొన్న విజయనగరం సీతం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు, అధ్యాపకులు.
visakhapatnam: విశాఖలో 'ఏఐ ఫ్యూజన్' సదస్సులో పాల్గొన్న సీతం బృందం!
visakhapatnam: సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (సీతం )డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు విశాఖపట్నంలో నిర్వహించిన ఏఐ ఫ్యూజన్ విజాగ్ సదస్సులో పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలు, పరిశ్రమల్లో ఏఐ వినియోగం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ప్రముఖ పరిశ్రమ నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బోష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, జేపీ మోర్గాన్ చేజ్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఈక్విఫ్యాక్స్ అమెరికా, టీసీఎస్, సైరెన్, జేడ్ గ్లోబల్, అడ్రోయిటెంట్, ప్యాట్రా తదితర అంతర్జాతీయ సంస్థలకు చెందిన సీనియర్ సాంకేతిక నిపుణులు కీలక ప్రసంగాలు చేశారు. ఏజెంటిక్ ఏఐ, ఎంటర్‌ప్రైజ్ ఏఐ, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏఐ ఫర్ ఇండస్ట్రీస్, ఏఐ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి అత్యాధునిక అంశాలపై వారు విలువైన సమాచారాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ, పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ దృక్పథం, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులను భవిష్యత్ సాంకేతిక సవాళ్లకు సిద్ధం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
సదస్సులో పాల్గొన్న సీతం విద్యార్థులు ప్రముఖ ఏఐ నిపుణులతో మమేకమై, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్ కెరీర్ అవకాశాలపై విలువైన మార్గదర్శకత్వాన్ని పొందారు. సీతం విద్యార్థులకు ప్రపంచ స్థాయి పరిశ్రమ అనుభవాన్ని అందించాలనే సంస్థ లక్ష్యానికి ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలిచింది.




