Anakapalli: సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవాడు విలపిస్తున్న తండ్రి

Anakapalli: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం. పాము కాటుకు నాటు వైద్యం చేయించడంతో పరిస్థితి విషమించి పైలా ప్రసాద్ (యువుకుడు) మృతి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 25 Aug 2026 11:31 AM IST
Anakapalli
X

Anakapalli: సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవాడు విలపిస్తున్న తండ్రి

Anakapalli: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం ఘటన.పొలంలో ఆవును తోలుకెళ్తుండగా పైలా ప్రసాద్‌కు పాము కాటు.వెంటనే ఆస్పత్రికి తరలించకుండా నాటు వైద్యుడిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు.కాలికి పసరు మందు రాసి ఇంటికి పంపించిన నాటు వైద్యుడు.

రాత్రి గడిచేకొద్దీ విషం శరీరమంతా వ్యాపించినట్లు సమాచారం.తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలింపు.ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రసాద్ మృతి.కుమారుడిని కోల్పోయి కన్నీరుమున్నీరైన తండ్రి.

“సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే నా కొడుకు బతికేవాడు” అంటూ తండ్రి ఆవేదన.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలింపు.పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యాన్ని ఆశ్రయించవద్దని అధికారుల సూచన.వెంటనే సమీపంలోని ప్రభుత్వ/అత్యవసర వైద్య కేంద్రానికి తరలించాలి అని వైద్య నిపుణుల సూచన.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story