Visakhapatnam: లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పీఎంపాలెం పోలీసులు!
Visakhapatnam: విశాఖపట్నం మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అవినాష్ మృతి చెందాడు.
Visakhapatnam: లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పీఎంపాలెం పోలీసులు!
Visakhapatnam: క్రికెట్ స్టేడియం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ సూపర్‌వైజర్ కె.అవినాష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం మధురవాడ చంద్రంపాలెం దుర్గానగర్‌కు చెందిన అవినాష్ ఐటీ సెజ్ హిల్‌నంబర్-2లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
వ్యక్తిగత పనిమీద మద్దిలపాలెం వెళ్లిన అవినాష్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న సిగ్నల్ వద్ద రోడ్డు దాటేందుకు వాహనాన్ని నెమ్మదించగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ అతని ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
లారీ ఢీకొన్న అనంతరం ద్విచక్రవాహనాన్ని సుమారు 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో అవినాష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. సీఐ జి.బాలకృష్ణ ఆదేశాల మేరకు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.




