Narsipatnam: గొలుగొండలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గొలుగొండలో పీఎం-అజయ్, ట్రైకోర్ పథకాల ద్వారా గిరిజన మహిళలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆటోలను పంపిణీ చేశారు.
Narsipatnam: గొలుగొండలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
Narsipatnam: గొలుగొండ మండల కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొని లబ్ధిదారులకు ఆటోలను అందజేశారు. ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (PM-AJAY) స్కీమ్‌లో భాగంగా, ట్రైకోర్ (TRICOR) సబ్సిడీ మరియు ఉన్నతి రుణం ద్వారా ఎంపికైన ఆరుగురు ఎస్టీ సంఘ సభ్యులకు ఆయన చేతుల మీదుగా ఈ ఆటోల తాళాలను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పేద, గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబన మరియు స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడినప్పుడే కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ పథకం కింద ఒక్కో ఆటో యూనిట్ ధర రూ. 3,34,000 కాగా, 'వెలుగు' ఉన్నతి పథకం ద్వారా రూ. 2,20,000 వడ్డీ లేని రుణం మరియు ట్రైకోర్ ద్వారా రూ. 50,000 సబ్సిడీగా లభించింది. మిగిలిన రూ. 64,000 మొత్తాన్ని ఇన్సూరెన్స్‌తో కలిపి లబ్ధిదారులు సొంత నిధుల ద్వారా చెల్లించారు. మండలంలోని చోద్యం, సాలిక మల్లవరం, నిమ్మగడ్డ, కొత్తపాలెం, లింగందోరపాలెం, ఏటీ గైరంపేట గ్రామాల నుండి ఒక్కొక్కరి చొప్పున మొత్తం ఆరుగురు లబ్ధిదారులను ఎంపిక చేశారు.
వీరికి ట్రైకోర్ సబ్సిడీ రూ. 3,00,000 తో పాటు ఉన్నతి రుణం ద్వారా రూ. 2,41,500 వడ్డీ లబ్ధి కలిపి మొత్తం రూ. 5,41,500 ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అడిగర్ల నాని బాబు, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సూర్యచంద్ర, గొలుగొండ మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.




