Madhurawada: మధురవాడ బొజ్జ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు!

Madhurawada: మధురవాడ శ్రీనివాస్ నగర్‌లో బొజ్జ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

JAI RAM, MADURAWADA
Published on: 16 Sept 2026 9:21 PM IST
Madhurawada
X

Madhurawada: మధురవాడ బొజ్జ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు!

విశాఖపట్నం జిల్లా, మధురవాడ: శ్రీనివాస్ నగర్‌లో బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బొజ్జ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథుడిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగోతి వెంకట సత్యనారాయణ (జపాన్), కానూరి అచ్యుతరావు, నాగోతి సూర్య ప్రకాష్, బుగత శ్రీనివాస్, బైపిల్లి శ్రీరామ్ మూర్తి, మనిగాం కుమార్ తదితరులు వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

వినాయక చవితి సందర్భంగా యువత ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని నాయకులు అభినందించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు యువతలో ఐక్యత, సామాజిక సేవా స్ఫూర్తి పెంపొందేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తిబాబు, మహేష్, గణేష్, హరీష్, సురేష్, జయరాం, సతీష్, భాష, సింహాచలం, రాజు, గౌతమ్, పృద్వి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA