Anakapalle: ఘనంగా మల్ల సురేంద్ర జన్మదిన వేడుకలు!

Anakapalle: గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కీ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 25 Aug 2026 1:39 PM IST
Anakapalle
X

Anakapalle: ఘనంగా మల్ల సురేంద్ర జన్మదిన వేడుకలు!

Anakapalle: గవరపాలెంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్ల సురేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు సందడిగా సాగాయి.

ఈ కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరై మల్ల సురేంద్రకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి జన్మదిన కేక్‌ను కట్ చేయించి, ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా భీమరశెట్టి రామ్కీ మాట్లాడుతూ.. అతి చిన్న కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందిన వ్యక్తిగా మల్ల సురేంద్ర నిలిచారని కొనియాడారు. పార్టీ కష్టకాలంలోనూ వెనుకడుగు వేయకుండా పార్టీకి అండగా నిలిచారని అన్నారు.

ప్రత్యేకంగా 2019–24 మధ్య కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పార్టీ కోసం అనేక పోరాటాలు చేశారని, ఆయన అంకితభావం అభినందనీయమని భీమరశెట్టి రామ్కీ ప్రశంసించారు. మల్ల సురేంద్ర భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిన జీవితాన్ని గడపాలని భీమరశెట్టి రామ్కీ ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కూడా మల్ల సురేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story