Anakapalli: ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి విద్యార్థులకు ఎమ్మెల్యే కొణతాల!
Anakapalli: అనకాపల్లి రేబాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవ, వనమహోత్సవ వేడుకలు నిర్వహించారు.
Anakapalli: ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి విద్యార్థులకు ఎమ్మెల్యే కొణతాల!
Anakapalli: అనకాపల్లి రేబాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2047 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం, వనమహోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ హాజరై మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ కళాశాలలోని 10 ఎకరాల ప్రాంగణాన్ని గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు, యోగా వంటి కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేబాక గ్రామాన్ని కళాశాల తరఫున దత్తత తీసుకుని విద్య, పారిశుధ్యం, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
‘నాకు సాధ్యం కాదు’ అనే ఆలోచనను విడిచిపెట్టి ‘నేను సాధించగలను’ అనే ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 100 శాతం అడ్మిషన్లు, 100 శాతం ప్లేస్‌మెంట్ల దిశగా ముందుకు సాగడం అభినందనీయమని కొణతాల పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ విద్యార్థులకు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.




