Pendurthi: పెందుర్తిలో రూ.35కే కిలో ఉల్లి.. ఎమ్మెల్యే పంచకర్ల ప్రారంభం!

Pendurthi: పెందుర్తి రైతు బజార్‌లో రూ. 35కే కిలో ఉల్లిపాయల విక్రయం కౌంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని స్పష్టీకరణ.

GOPI, PENDURTHI
Published on: 3 Oct 2026 10:15 PM IST
Pendurthi
X

Pendurthi: పెందుర్తిలో రూ.35కే కిలో ఉల్లి.. ఎమ్మెల్యే పంచకర్ల ప్రారంభం!

పెందుర్తి: ప్రజల కష్టసుఖాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుందని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం పెందుర్తి రైతు బజార్లో ప్రభుత్వ అందిస్తున్న చౌక ధరల ఉల్లిపాయల కౌంటర్ ను ఆయన ప్రారంభించారు. రైతులతోనూ వ్యాపారులతోనూ మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

రైతు బజార్లో వినియోగదారులకు అందిస్తున్న ధరలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కిలో 65 రూపాయలుగా ఉన్న ఉల్లిపాయలను కేవలం 35కే రైతు బజార్లలో విక్రయిస్తున్నామని, ప్రతి కుటుంబానికి రెండు కిలోలు చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు.

అన్ని వర్గాల ప్రజలకు చౌక ధరలో ఉల్లిపాయలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మార్కెట్లో ధరలు పెరిగినా, ప్రజలకు ఇబ్బంది లేకుండా సబ్సిడీపై వస్తువులను అందిస్తున్న ప్రభుత్వం కూటమి మాత్రమేనని వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI