Anakapalli: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: పట్టెం రాజబాబు!

Anakapalli: నాతవరం మండలం సరుగుడులో రైతులకు సబ్సిడీపై యూరియా పంపిణీ. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నర్సీపట్నం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాజబాబు వెల్లడి.

R. A. Naidu, Narsipatnam
Published on: 11 Sept 2026 10:44 PM IST
Anakapalli
X

Anakapalli: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: పట్టెం రాజబాబు!

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో గల సరుగుడు గ్రామ పంచాయితీ వద్ద శుక్రవారం నర్సీపట్నం మార్కెట్ యార్డ్ డైరెక్టర్. పట్టెం రాజబాబు ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై యూరియా పంపిణీ చేయడం జరిగిందని.

ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పంటల కు సంబంధించిన అన్ని రకముల ఎరువులను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సరుగుడు గ్రామ అధ్యక్షులు ఎనుముల సతీష్ మండల టిడిపి ఎస్టి సెల్ అధ్యక్షులు బండి శివరామకృష్ణ మద్దెల గంగాధర హార్టికల్చర్ అసిస్టెంట్ ఆర్ నరేంద్ర రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam