Chodavaram: చోడవరం పట్టణంలో పంచాయతీ ఆధ్వర్యంలో 'స్వచ్ఛ పథం'!
Chodavaram: చోడవరం ఫిషర్ మెన్ కాలనీలో 'స్వచ్ఛ పథం'. తడి, పొడి చెత్తపై పంచాయతీ ఈవో గంగాధర్ అవగాహన.. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక.
Chodavaram: చోడవరం పట్టణంలో పంచాయతీ ఆధ్వర్యంలో 'స్వచ్ఛ పథం'!
Chodavaram: చోడవరం పట్టణంలో ఉన్న ఫిషర్ మెన్ కాలనీలో స్వచ్ఛ పదం అనే కార్యక్రమం చోడవరం పంచాయతీ కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రహదారికి ఇరువైపులు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి అక్కడున్న కాలువలో చెత్తను తొలగించి ఆ చెత్తను ట్రాక్టర్ ద్వారా దూరంగా తరలించారు..
ఈ కార్యక్రమంలో భాగంగా చోడవరం పంచాయతీ ఈవో గంగాధర్ అక్కడున్న ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం పై అవగాహన కల్పించి. స్థానిక ప్రజానీకం రోడ్లపై కానీ కాలువలో కానీ చెత్త వేయరాదని. అలా చేయడం ద్వారా మన ప్రాంతాన్ని మనమే నాశనం చేసుకుని పలు రోగాలు రావడానికి ఆస్కారాన్ని కల్పిస్తున్నామని ప్రజలంతా ఈ విషయంలో చైతన్యవంతం అవ్వాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా చెత్తను రోడ్లపై గాని కాలువల్లో కానీ ఎవరైనా వేసినట్లు తమ దృష్టికి వస్తే పంచాయితీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజానీకం తో పాటు చోడవరం ఎంపీడీవో , ఈవో గంగాధర్ , సానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణ రావు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి బుధవారం స్వచ్ఛ పధం కార్యక్రమం ద్వారా చోడవరం పంచాయతీ పరిధిలోని వారానికి ఒక వీధిని ఇదే విధంగా శుభ్రం చేసి చోడవరం పంచాయతీని స్వచ్ఛ పంచాయతీగా మార్చడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా తెలియజేశారు.




