Tagarapuvalasa: అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా హ్యాకథాన్

Tagarapuvalasa: తగరపువలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల వినూత్న ప్రాజెక్టులతో హ్యాకథాన్ ఘనంగా జరిగింది; ఏఐ, ఐఓటీ నమూనాలను నిపుణులు ప్రశంసించారు.

SHIVA, BHIMILI
Published on: 6 Oct 2026 6:05 PM IST
Tagarapuvalasa
X

Tagarapuvalasa: అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా హ్యాకథాన్

Tagarapuvalasa: తగరపువలస, అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అవంతి విద్యా సంస్థల చైర్మన్, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఆదేశాల ప్రకారం హేకతన్ కార్యక్రమాన్ని అతిధులతో జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్లును వాటియొక్క ఉపయోగము గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇందులో ముఖ్యాముగా హాస్టల్ లీవ్ అప్లికేషన్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అటెండన్స్ మేనేజ్మెంట్ యాప్, స్మార్ట్ అగ్రికల్చర్ సిస్టమ్, క్యూఆర్ అటెండన్స్ సిస్టమ్, అవంతి సిస్టమ్స్ సెక్యూరిటీ, అవంతి 360 యాప్, అడ్మిషన్ కాలర్ అసిస్టెంట్, ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ యొక్క ఉపయోగలను గురుంచి అడిగి తెలుసుకొని విద్యార్థులను ప్రశంసించారు.

ప్రత్యేక అతిధిగా ఎస్. వేణుగోపాల్, కంప్యూటర్ సైన్స్ హెచ్.ఓ.డి., గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, భీమునిపట్నం విద్యార్థులను ఉద్దేశించి మారుతున్న పరిస్థితులనుగుణంగా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలుపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రపంచము మొత్తము ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ అభివృద్ధి చెందుతుందని వాటిని ఉపయోగించి ఉద్యోగావకాశములు పొందగలరని వివరించారు.

విద్యార్థులకు తరగతి గదిలో చెప్పే పాఠాలతో పాటు ప్రయోగశాల పరిజ్ఞానం కూడా కీలకం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి Mr. బి. కృష్ణ చైతన్య, వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఆపరేషన్స్ ఇన్స్పైరో ఏడ్జ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలోను నైపుణ్యము, ప్రయోగాలపైన నైపుణ్యం, భవిష్యత్తుపై దిశా నిర్దేశంచేసుకొని లక్ష్యాన్ని సాధించుకోగలరని విద్యార్థులకు వివరించారు.

సమస్యను తెలుసుకొని దానికి పరిస్కారం చూపేవిధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. నేడు ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ అనేది అన్ని రంగాలలోనూ ప్రత్యేకపాత్ర పోషిస్తుందని వాటిపైన దృష్టి పెట్టాలని హితవు పలికారు అలాగే Mr. కె. అమరనాథ్, సీనియర్ లెక్చరర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, భీమునిపట్నం మాట్లాడుతూ ప్రస్తుత సమాజములో ఆర్టిఫియషల్ ఇంటలిజెన్స్ ఉపయోగము ఎక్కువగావుంది.

ఉద్యోగావకాశములు కూడా ఈ రంగములో అధికముగా వున్నాయని తెలిపారు . ఈ సాంకేతిక ఉత్సవంలో ప్రాజెక్ట్ ఎక్స్పోలను విద్యార్థులు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమములో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రములను అందించారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. మురళీకృష్ణ గారు, డైరెక్టర్ డా. ఎ. చంద్రశేఖర్ గారు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బి. జగదీశ్వరరావుగారు, విభాగాధిపతి శేషు ఆమిటి,అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI