Nathavaram: రాష్ట్రస్థాయి 'స్వచ్ఛ అవార్డు' గెలుచుకున్న తాండవ గిరిజన పాఠశాల!

Nathavaram: అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు రాష్ట్ర స్థాయి 'స్వచ్ఛ అవార్డు'. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందనలు.

R. A. Naidu, Narsipatnam
Published on: 30 Sept 2026 1:32 PM IST
Nathavaram
X

Nathavaram: రాష్ట్రస్థాయి 'స్వచ్ఛ అవార్డు' గెలుచుకున్న తాండవ గిరిజన పాఠశాల!

Nathavaram: అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ (జీటీడబ్ల్యూ) బాలికల ఆశ్రమ పాఠశాల రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ - 2026' కు ఎంపిక కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంతోషం వ్యక్తం చేశారు.

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న ఈ ఆశ్రమ పాఠశాల 'స్వచ్ఛ హాస్టల్స్' విభాగంలో ఉత్తమ నిర్వహణ, పరిశుభ్రత కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డును సొంతం చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణాధికారులు, సిబ్బంది, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరియు విద్యార్థినులకు సభాపతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

​హాస్టల్ ఆవరణ, నివాస బ్లాకుల పరిశుభ్రత, శుభ్రమైన మరుగుదొడ్లు, చేతులు శుభ్రం చేసుకునే సదుపాయాలు, భోజన శాల మరియు వంటగది నిర్వహణ, తడి-పొడి చెత్త వేరుచేసే విధానం వంటి అంశాలలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించి ఈ అవార్డు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam