Etapaka: ఎటపాక మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం!
Etapaka: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో కూటమి జడ్పీటీసి, ఎంపీటీసీ అభ్యర్థుల విజయం కోసం మాజీ వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు ప్రచారం.
Etapaka: ఎటపాక మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం!
ఎటపాక: ఎటపాక మండలంలో జడ్పిటిసి , ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే ఎటపాక మండలంలోని పంచాయతీల అభివృద్ధికి విశేష కృషి చేస్తామని మాజీ వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు పేర్కొన్నారు.ఆదివారం నాడు ఆయన గౌరీదేవిపేట పంచాయతీలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నవంబర్ 3వ తేదీన జరగబోయే జడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఎటపాక జెడ్పిటిసి అభ్యర్థిగా పాయం దేవి ,నందిగామ గ్రామపంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా పూసం రమాదేవి బరిలో ఉన్నారని కాబట్టి వారిరువురిని ఆదరించి ఆశీర్వదించి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి సహకారంతో పంచాయితీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ,ఎమ్మెల్యే సహకారంతో ఇప్పటికే పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థిని పాయం దేవి ,ఎంపీటీసీ అభ్యర్థిని పూసం రమాదేవి , టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు అమరవరపు రాము , తెలుగుదేశం నాయకులు సండ్ర రఘు , ముక్కెర భద్రరావు , కాటిపోయిన మోహన్ రావు , తుర్రం చిట్టియ్య , చుండ్రు రాజా , మడకం నరసింహారావు , గడ్డం నాగరాజు , మడక లక్ష్మయ్య , సూదిపాక భద్రం , స్వాతి , ములకలపల్లి సాయిబాబు , ములకలపల్లి జ్యోతి , సూదిపాక రమణ , పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.




