Pendurthi: పెందుర్తి అయ్యప్ప కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Pendurthi: పెందుర్తి 96వ వార్డు అయ్యప్ప కాలనీలో వినాయక చవితి వేడుకలు. భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు గండి వంశీ.
Pendurthi: పెందుర్తి అయ్యప్ప కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Pendurthi: శ్రీ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు, దివ్య ఆశీస్సులు ప్రజలందరిపైనా ఎల్లవేళలా ఉండాలని, సమాజంలో అందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని టీడీపీ నాయకులు గండి వంశీ ఆకాంక్షించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోని అయ్యప్ప కాలనీలో స్థానిక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ముందుగా అయ్యప్ప కాలనీలో అలంకరించిన మంటపంలో వేంచేసి ఉన్న వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, నాళికేర సమర్పణ చేశారు. అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని గండి వంశీ స్వయంగా ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు.
ఈ సందర్భంగా గండి వంశీ మాట్లాడుతూ సకల విఘ్నాలను తొలగించే తొలిపూజలందుకొనే దేవుడు విఘ్నేశ్వరుడని కొనియాడారు. భక్తులంతా ఐక్యమత్యంతో, ఆధ్యాత్మిక చింతనతో ఉత్సవాలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. ప్రజల జీవితాల్లో ఉండే అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి, అభివృద్ధి పాతలో పయనించాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇటువంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వర రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, 96 వార్డ్ టిడిపి అధ్యక్షుడు పెంటకోట ప్రసాద్, ఆళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.




