Tenali: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన జడ్పీటీసీ ఎన్ని శ్రీనివాసరావు!
Tenali: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను తెనాలిలోని నివాసంలో ఆనందపురం మండల జడ్పీటీసీ ఎన్ని శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి మండల సమస్యలను వివరించారు.
Tenali: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన జడ్పీటీసీ ఎన్ని శ్రీనివాసరావు!
తెనాలి, నవంబర్ 18: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను తెనాలిలోని నివాసంలో బుధవారం ఆనందపురం మండల జడ్పీటీసీ ఎన్ని శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జడ్పీటీసీకి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ స్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని కొన్ని సమస్యలను జడ్పీటీసీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. జడ్పీటీసీతో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, బుద్దాల కృష్ణమోహన్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.




