Gajapathinagaram: వైసీపీ డీఎస్సీ ర్యాలీ అడ్డుకత, పోలీసులతో తోపులాట!
Gajapathinagaram: డీఎస్సీ అవకతవకలపై మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో చేపట్టిన వైసీపీ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట.
Gajapathinagaram: వైసీపీ డీఎస్సీ ర్యాలీ అడ్డుకత, పోలీసులతో తోపులాట!
Gajapathinagaram: గజపతినగరంలో డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నాయకులు చేస్తున్న ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పోలీసులు వైసిపి నాయకులు మధ్య తోపులాట. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన. డీఎస్సీ అభ్యర్థులే కుటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని బొత్స అప్పల నరసయ్య మండిపడ్డారు.
విజయనగరం జిల్లా గజపతినగరంలో ఉద్రిక్త వాతావరణం నడుమ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు డీఎస్సీ లో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన పరిస్థితులతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య డిమాండ్ చేశారు.




