Madhurawada: తొట్లకొండ సందర్శనపై రెండ్రోజులు ఆంక్షలు – కలెక్టర్ ప్రకటన
Madhurawada: విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాల నేపథ్యంలో తొట్లకొండ పర్యాటక ప్రాంతానికి శని, ఆదివారాల్లో పర్యాటకులకు అనుమతి లేదని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు.
Madhurawada: తొట్లకొండ సందర్శనపై రెండ్రోజులు ఆంక్షలు – కలెక్టర్ ప్రకటన
మధురవాడ: విశాఖ వేదికగా శనివారం, ఆదివారం బ్రిక్స్ దేశాల యువజన,క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతం అయిన తొట్లకొండ వద్ద పర్యాటకులకు అనుమతి ఉండదని, ఈమేరకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతం తొట్లకొండ వద్ద శనివారం ఉదయం బ్రిక్స్ దేశాల ప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమం, సందర్శన ఉంటుందని తెలిపారు. అలాగే 23వ తేదీ సాయంత్రం మరలా మంత్రులు, బ్రిక్స్ దేశాల ప్రతినిధులు సందర్శన ఉంటుందని,కావున ఈ రెండు రోజులూ సాధారణ సందర్శకులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
Next Story




