Anakapalle: అనకాపల్లిలో ఘనంగా ఆత్మజ్ఞాన యోగాశ్రమం 13వ వార్షికోత్సవం!
Anakapalle: అనకాపల్లి లక్ష్మీదేవిపేట ఆత్మజ్ఞాన యోగాశ్రమం 13వ వార్షికోత్సవం మరియు సద్గురు రాజర్షి ఆత్మానంద స్వామి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
Anakapalle: అనకాపల్లిలో ఘనంగా ఆత్మజ్ఞాన యోగాశ్రమం 13వ వార్షికోత్సవం!
Anakapalle: స్థానిక లక్ష్మీదేవిపేటలోని థాట్స్ ఆఫ్ లివింగ్ (ఆత్మజ్ఞాన యోగాశ్రమం) 13వ వార్షికోత్సవంతో పాటు సద్గురు రాజర్షి ఆత్మానంద స్వామి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది స్వామీజీలు, మాతాజీలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా సద్గురు రాజర్షి ఆత్మానంద స్వామి భక్తులకు దివ్య సందేశాన్ని అందించి ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులు, శిష్యుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆత్మానంద స్వామి మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా ఎలాంటి రుసుము తీసుకోకుండా నిరంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరమేశ్వరుడి ఆశీస్సులు లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలతో పాటు అనకాపల్లి ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆత్మజ్ఞాన యోగాశ్రమం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
స్వామీజీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకలకు విచ్చేసిన స్వామీజీలు, మాతాజీలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, శిష్యులు, భక్తులు పాల్గొన్నారు.




