Anakapalli: మూడు రోజులకే సమస్యలపై దృష్టి.. తుమ్మపాల అభివృద్ధికి కొత్త సర్పంచ్ శ్రీకారం!

Anakapalli: అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ ఆడారి జగదీశ్వరి గోవిందరావు ఎన్నికైన మూడు రోజుల్లోనే సెంటర్ లైటింగ్ పనులను ప్రారంభించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Updated on: 25 Nov 2026 10:50 AM IST
Anakapalli:  మూడు రోజులకే సమస్యలపై దృష్టి.. తుమ్మపాల అభివృద్ధికి కొత్త సర్పంచ్ శ్రీకారం!
X

అనకాపల్లి: అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆడారి జగదీశ్వరి గోవిందరావు.. బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామ సమస్యలపై దృష్టి సారించారు. సర్పంచ్‌గా ఎన్నికై మూడు రోజులు కూడా గడవకముందే.. గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న సెంటర్ లైటింగ్ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.

గుండాల జంక్షన్ నుంచి తుమ్మపాల గ్రామ చివరి వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించడం గ్రామస్తుల్లో హర్షం వ్యక్తం చేస్తోంది. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యపై కొత్త సర్పంచ్ వెంటనే స్పందించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో పలువురు ప్రజాప్రతినిధులకు సమస్యలను వివరించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అలాంటిది.. కొత్త సర్పంచ్ ఎన్నికైన కొద్ది రోజులకే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పంచాయతీ అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. ఇదే వేగంతో ముందుకు సాగితే తుమ్మపాల మేజర్ పంచాయతీని జిల్లాలోనే నెంబర్ వన్‌గా నిలుపుతారనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI