Gajuwaka: గాజువాకలో తిప్పల వంశీరెడ్డి భారీ సునామీ ర్యాలీ
Gajuwaka: గాజువాకలో కూటమి టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తిప్పల వంశీరెడ్డి భారీ సునామీ ర్యాలీ నిర్వహించి ఉంగరం గుర్తుపై మద్దతు కోరారు.
Gajuwaka: గాజువాకలో తిప్పల వంశీరెడ్డి భారీ సునామీ ర్యాలీ
గాజువాక: పేద గంట్యాడ... ర్యాలీలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి తిప్పల వంశి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నన్ను పార్టీ మరీ జనసేన, టీడీపీ లో గాని వచ్చి మేయర్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పడంతో జనసేన పార్టీ కండువా కప్పుకున్నాను ఆ రోజు నుండి పార్టీలోనే చలామణి అవుతున్నా ఇప్పుడు ఇరు పార్టీ నాయకులు కోన తాతారావు వంశీకృష్ణ యాదవ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తనకు జీవీఎంసీ ఎలక్షన్లలో టికెట్టు కేటాయించకుండామొండి చేయి చూపడంతో నాయకులకు ఎవరికి కాల్ చేసినా సరైన జవాబు రాకపోవడంతో తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండేందుకు గాను తను స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయంతో తనకు జరిగిన అన్యాయాన్ని నాయకులు నా సపోర్ట్ ని వాడుకొని వదిలేసినందుకే మళ్లీ అదే ప్రజల్లోకి వెళ్లి కార్పొరేటర్ గా గెలిచి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
గాజువాక 91,మరియు 95 వార్డుల ప్రధాన కూడలిలో అక్క చెల్లమ్మల భద్రతకు సీసీ కెమరా పరివేక్షణ ఏర్పాట్లు చేస్తా ప్రజల ఓటే వార్డు అభివృద్ధికి నాంది ప్రజల మాటగా నా మాట పలకాలంటే కౌన్సిల్లో వార్డు అభివృద్ధి నిధులు రప్పించాలంటే కూడా ఉంగరం కొండ గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నిత్యం మీకు అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తిగా మీ అందరికీ దగ్గరగా ఉండి ప్రతి ఒక్క సమస్యనే క్షుణ్ణంగా పరిశీలించి సహాయం చేయడంలో ముందుండే వ్యక్తిగా నిరుద్యోగులకు కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలు విద్యార్థులకు స్కాలర్షిప్ రాయితీలు వార్డులలో నిత్యం పనిచేసేలా గవర్నమెంట్ చిన్న ఆస్పత్రిలో, కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో ముందు ఉంటానని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




