Pendurthi: శ్రీవారిని దర్శించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
Pendurthi: తిరుమలలో శ్రీవారిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరారు.
Pendurthi: శ్రీవారిని దర్శించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
విఐపి బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న ఆయనకు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తీర్థప్రసాదాలు అందజేయగా, రంగనాయకుల మంటపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన
దర్శనానంతరం పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ — నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందించేలా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్. రాజు సీనియర్ నాయకులు రాజా సుధాకర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.




