Bheemili: రాబోయే రోజుల్లో కార్యకర్తలకే పెద్దపీట: బొత్స!

Bheemili: భీమిలి వైఎస్సార్‌సీపీ సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు; స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపు.

SHIVA, BHIMILI
Published on: 13 Sept 2026 11:20 AM IST
Bheemili
X

Bheemili: రాబోయే రోజుల్లో కార్యకర్తలకే పెద్దపీట: బొత్స!

Bheemili: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో చిట్టివలస శ్రీలక్ష్మి శ్రీనివాస కళ్యాణ మండపం లో శనివారం నాడు భీమిలి నియోజకవర్గ స్థాయి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సమావేశానికి వైసిపి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు,యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ,నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సమావేశం కి అదిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరై బ్రహ్మరథం పట్టారు.జననేత జగన్ పేరు బొత్స నోటి వెంట వినగానే సభా ప్రాంగణం నినాదాలతో హారెత్తంది.త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు అంతా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం ను ఉద్దేశించి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది.

ప్రజలు ఆశించిన పాలన కనిపించడం లేదు. ధరలు పెరిగాయి, నిరుద్యోగ సమస్య అలాగే ఉంది, అభివృద్ధి పనులు మందగించాయి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రచారాలకే పరిమితమవుతున్నారు.

ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుంది అని ఆయన తెలియజేశారు.

పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

అలాగే రాబోయే మున్సిపల్ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.మీ కష్టాల్లో మీకు తోడుగా మీ బాధల్లో మీకు అండగా మీ హక్కుల కోసం పోరాటంలో ముందుండి, మిమ్మల్ని కాపాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.

అనంతరం వివిధ పదవుల్లో నియమించిన వారికి గుర్తింపు కార్డులను బొత్సా సత్యనారాయణ చేతులు మీదుగా అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్లు,జీవీఎంసీ వార్డ్ అధ్యక్షులు,మండలానికి చెందిన పార్టీ అధ్యక్షులు,ప్రతి గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు,సోషల్ మీడియా అధ్యక్షులు,వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI