Paderu: అల్లూరి జిల్లాలో ఘనంగా 'త్రిశూల్' అవగాహన కార్యక్రమం, ర్యాలీ!
Paderu: అల్లూరి జిల్లాలో 'త్రిశూల్' కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై పాడేరులో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Paderu: అల్లూరి జిల్లాలో ఘనంగా 'త్రిశూల్' అవగాహన కార్యక్రమం, ర్యాలీ!
Paderu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “త్రిశూల్” కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాడేరు అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్, . ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళలపై నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
త్రిశూల్ కార్యక్రమం మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతుందని అధికారులు తెలిపారు
మహిళలపై నేరాలకు జీరో టాలరెన్స్
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం – జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యం
మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్
పోలీస్ శాఖ మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహిళలపై నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని. ప్రస్తుత గణాంకాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 32 కేసులు, POCSOకు సంబంధించి 4 కేసులు నమోదయాయని.
మహిళలు, బాలికల భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఏదైనా వేధింపులు లేదా నేరం జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని.
ప్రస్తుత గణాంకాల ప్రకారం జిల్లాలో 103 రోడ్డు ప్రమాదాలు జరిగాయని. వీటిలో 69 ప్రాణాంతక ప్రమాదాలు, 34 ప్రాణాంతకం కాని ప్రమాదాలు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రూ.18,395/- చలానాలు విధించగా, వాటిలో 24 శాతం రియలైజేషన్ నమోదైంది.
హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం, వేగ నియంత్రణ పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్
జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక దాడులు మరియు తనిఖీలు నిర్వహిస్తున్నామని.
జిల్లాలో ఇప్పటివరకు 81 NDPS కేసులు నమోదు చేసి, 10,625 కిలోల గంజాయి, 42.9 కిలోల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో మొత్తం 346 మంది నిందితులు ఉండగా, వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారు 138 మంది ఉన్నారు.
మాదకద్రవ్యాల బారిన పడిన యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి డీ-అడిక్షన్ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 33 మందిని డీ-అడిక్షన్ కార్యక్రమంలో చేర్చి వారికి అవసరమైన సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే త్రిశూల్ లక్ష్యాల సాధన
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ “మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన అనేవి పోలీస్ శాఖ ఒక్కటే సాధించాల్సిన లక్ష్యాలు కావు. ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు మరియు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే త్రిశూల్ లక్ష్యాలను సమర్థవంతంగా సాధించగలం” అని తెలిపారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, మహిళలు మరియు బాలికల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎస్పీ సూచించారు.
“సురక్షిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




