Visakhapatnam: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల విచారణ
Visakhapatnam: విశాఖపట్నం-మర్రిపాలెం రైల్వే స్టేషన్ల మధ్య రైలు ప్రమాదంలో 42-45 ఏళ్ల వ్యక్తి మృతి. మృతుని వివరాలు తెలిస్తే సంప్రదించాలని జిఆర్‌పి పోలీసుల విజ్ఞప్తి.
Visakhapatnam: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల విచారణ
విశాఖపట్నం: తేది.23.08.2026 ది న సుమారు సాయంత్రం 17:10 గంటలకు ముందు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి మర్రిపాలెం రైల్వే స్టేషన్ మధ్య KM No.876 వద్ద డౌన్ లైన్ మరియు అప్ లైన్ రైల్వే పట్టాల మద్య వద్ద, రైల్వే కోచింగ్ కాంప్లెక్స్ వద్ద సుమారు 42-45 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి రైలు ప్రమాదంలో మృతిచెందినాడు.
మృతుని ఎత్తు సుమారు 5.4" అడుగులు, చామన ఛాయ రంగు కలిగి ఉన్నాడు. మృతుడు తెలుపు రంగు చొక్కా, దానిపై నీలం మరియు ఆకుపచ్చ రంగు చెక్స్ డిజైన్, ఫుల్ హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు, బూడిద రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహం చుట్టుపక్కల వెతకగా యెటువంటి ఆధారాలు లబించలేదు.
విశాఖపట్నం జిఆర్పి సి.ఐ శ్రీ డి.దీనబందు గారు ఆదేశాలు మేరకు ఎస్ఐ టి . శ్రీనివాసరావు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని యొక్క వివరములు ఎవరికైనా తెలిసిన యెడల ఎస్ఐ శ్రీ టి.శ్రీనివాసరావు గారు, సెల్ నెం. 9346348929,9247585737 విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ గారిని సంప్రదించగలరు/ తెలియపరచగలరు.




