Anakapalli: అడ్డూరులో ఘనంగా ఉత్తరాంధ్ర కోలాటం బృందాల ఆత్మీయ సమావేశం!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు మజ్జి గైరమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉత్తరాంధ్ర జిల్లాల కోలాటం గురువులు, సభ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 14 Oct 2026 3:11 PM IST
Anakapalli
X

Anakapalli: అడ్డూరులో ఘనంగా ఉత్తరాంధ్ర కోలాటం బృందాల ఆత్మీయ సమావేశం!

Anakapalli: అనకాపల్లి జిల్లా, చోడవరం నియోజకవర్గం , చోడవరం మండలం, అడ్డూరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ మజ్జి గైరమ్మ అమ్మవారి ఆలయం వద్ద నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల కోలాటం గురువులు, ఆర్గనైజర్లు , గ్రూప్ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది.. ఉత్తరాంధ్ర కోలాటం గ్రూప్ రిజిస్ట్రేషన్ వివరాలను గురువులకు, ఆర్గనైజర్లకు, గ్రూప్ సభ్యులకు తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంనకు ఉమ్మడి విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 60 మంది కోలాటం గురువులు, 300 మంది కోలాటం మహిళలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కోలాటం గ్రూప్ ల యొక్క సమస్యలు, గ్రూప్ యొక్క నియమ - నిబంధనలు , భవిష్యత్తులో చేయబోవు మంచి కార్యక్రమాలు, సంస్థ యొక్క ఆర్థిక నిధి , రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగినది. అలాగే కోలాటం సభ్యుల వ్యక్తిగత ఇన్సూరెన్స్ కొరకు, ఆర్థికంగా ఇబ్బంది పడిన కోలాటం గురువులకు , సభ్యులకు ప్రత్యేక సహకారం కొరకు చర్చించడం జరిగినది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM