Chodavaram: వడ్డాది జంక్షన్‌లో "నషా ముక్త్ భారత్" అవగాహన ర్యాలీ!

Chodavaram: అనకాపల్లి జిల్లా వడ్డాది జంక్షన్ లో బుచ్చెయ్యపేట పోలీసుల ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ వాక్‌థాన్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 26 Jun 2026 5:02 PM IST
Chodavaram
X

Chodavaram: వడ్డాది జంక్షన్‌లో "నషా ముక్త్ భారత్" అవగాహన ర్యాలీ!

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నేడు వడ్డాది జంక్షన్‌లో "నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా సుమారు 70 మంది విద్యార్థులతో కలిసి అవగాహన వాక్‌థాన్ ర్యాలీ నిర్వహించబడింది.

ఈ సందర్భంగా స్థానిక ఎస్.ఐ మనోజ్ కుమార్ .....మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణ, సైబర్ నేరాలు మరియు ఇటీవల పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, ఏదైనా అనుమానాస్పద సంఘటనలు లేదా సైబర్ మోసాలకు గురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story