Nakkapalli: విజయదశమి వేళ హోం మంత్రి వంగలపూడి అనిత పూజలు
Nakkapalli: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నక్కపల్లిలో హోం మంత్రి వంగలపూడి అనిత ఆయుధ, వాహన పూజలు చేసి, అడ్డురోడ్డు దుర్గాదేవిని దర్శించుకున్నారు.
Nakkapalli: విజయదశమి వేళ హోం మంత్రి వంగలపూడి అనిత పూజలు
అనకాపల్లి జిల్లా: నక్కపల్లి లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నక్కపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
పండుగ సందర్భంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం యస్.రాయవరం మండలం అడ్డురోడ్డు గ్రామంలోని శ్రీ దుర్గాదేవి అమ్మవారిని హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు హోం మంత్రి అనితను ఘనంగా సత్కరించారు.




