Anakapalli: అనకాపల్లి నూకాంబిక ఆలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు!

Anakapalli: అనకాపల్లి గవరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగిన వినాయక చవితి పూజలు.. తరలివచ్చిన భక్తులు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 1:29 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి నూకాంబిక ఆలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు!

Anakapalli: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా భక్తుల కొంగు బంగారంగా కొలువుదీరిన అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భాద్రపద మాసం చవితి సందర్భంగా సోమవారం ఆలయ మండపంలో ప్రత్యేకంగా వినాయక చవితి పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. వినాయకునికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

వినాయక చవితి సందర్భంగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి, కుమారి నాగేష్తో పాటు ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI