Visakhapatnam: అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా యోగా దినోత్సవం
Visakhapatnam: విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Visakhapatnam: అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా యోగా దినోత్సవం
Visakhapatnam: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక లలిత కాలనీ మరియు డాబా గార్డెన్స్ పరిసర ప్రాంతాలలో యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజ్ఞాన కేంద్రంలో యోగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా, యోగా టీచర్ సావిత్రమ్మ మరియు వారి మిత్రురాలు ప్రభావతి సహకారంతో ఇద్దరు పేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు బుజ్జి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతిరోజూ ఉచిత యోగా, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణతో పాటు ఉచిత క్లినిక్ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు స్వాతంత్ర్య సమరయోధుల జయంతి, వర్ధంతి సభలు, సాంస్కృతిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపడుతున్నామని వెల్లడించారు.
యోగా శిక్షకురాలు సావిత్రమ్మ మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు బిపి, షుగర్ వంటి వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ, పిల్లలందరూ యోగా నేర్చుకొని క్రమశిక్షణగా మెలగాలి అన్నారు. యోగా శిక్షణ పొందిన విద్యార్థులు యోగా టీచర్ సావిత్రమ్మకు శాలువా కప్పి సత్కరించుకున్నారు.
కార్యక్రమ నిర్వాహణలో సహకరించిన వారందరికీ కమిటీ సభ్యులు ఎల్లాజీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్ద మొత్తం మంది పాల్గొన్నారు.




