Visakhapatnam: ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధం

Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాపై అరిలోవ పోలీసుల నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

JAI RAM, MADURAWADA
Published on: 2 Nov 2026 10:30 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధం

విశాఖపట్నం: జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 3వ తేదీన జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని అరిలోవ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే బాణాసంచా కాల్చడం, డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా 144 Cr.P.C / 163 BNSS సెక్షన్ అమలులో ఉన్నందున అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఎలాంటి విజయోత్సవ కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అరిలోవ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA