Bheemili: భీమిలి నియోజకవర్గ ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు గంటా అభినందనలు!
Bheemili: విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాల్లో ఎన్నికైన విజేతలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
Bheemili: భీమిలి నియోజకవర్గ ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు గంటా అభినందనలు!
భీమిలి, నవంబర్ 19: భీమిలి నియోజకవర్గంలోని మూడు ఎంపీపీ స్థానాల్లో ఎన్నికైన విజేతలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. గురువారం జరిగిన ఎన్నికలో ఆనందపురం నుంచి టీడీపీ తరపున తాట్రాజు అప్పారావు, పద్మనాభం నుంచి కుచ్చర్లపాటి అరుణ కుమారి, భీమిలి నుంచి యరబాల కృష్ణవేణిలను.. వైస్ ఎంపీపీలుగా ఆబోతు యమున, కాళ్ల నగేష్ కుమార్, ఆర్. నాగరాజు (జనసేన)లను ఎన్నుకున్నారు. వీరందరినీ అభినందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని చెప్పారు.




