Visakhapatnam: ఎమ్మెల్యే గంటాను కలిసిన కూటమి కార్పొరేటర్లు!
Visakhapatnam: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును నూతనంగా గెలిచిన కూటమి కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా గంటా సూచించారు.
Visakhapatnam: ఎమ్మెల్యే గంటాను కలిసిన కూటమి కార్పొరేటర్లు!
విశాఖపట్నం: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ను టీడీపీ కార్పొరేటర్లుగా గెలిచిన గాడు చిన్ని కుమారి లక్ష్మి (3 వార్డు), పీవీ నరసింహం (120 వార్డు), గరే జ్యోతి (10 వార్డు), పాసి సుస్మిత (4 వార్డు) పిల్లా రేవతి (8 వార్డు), బీజేపీ కార్పొరేటర్ పరశురామరాజు (54 వార్డు) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినందుకు వారు గంటాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజలు ఉంచిన నమ్మకాన్ని పెంపొందించుకునేలా పని చేసి.. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా గంటా చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడుతున్నారని మున్సిపల్ ఎన్నికల ఏకపక్ష ఫలితాలు మరోసారి విస్పష్టం చేశాయని ఆయన పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారన్నారు. పార్టీ నాయకులు పిల్లా శివకృష్ణ, పిల్లా నరసింగరావు, గాడు యశ్వంత్, గరే గుర్నాథ్, పాసి త్రినాథ్, పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.




