Visakhapatnam: బీజేపీ గాజువాక యువమోర్చా ఇంచార్జ్‌గా జాగారపు శ్రీను

Visakhapatnam: గాజువాక బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం నియోజకవర్గ ఇంచార్జ్‌గా జాగారపు శ్రీను, కాలేజ్ అవుట్ రీచ్ సెల్ కన్వీనర్‌గా అగ్గాల సురేష్‌కు నియామక పత్రాలు అందజేశారు.

SHIVA, BHIMILI
Published on: 31 Aug 2026 11:08 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: బీజేపీ గాజువాక యువమోర్చా ఇంచార్జ్‌గా జాగారపు శ్రీను

విశాఖపట్నం: 31 బిజేపి యువ మోర్చా గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమిస్తూ జాగారపు శ్రీనుని మరియు జిల్లా కాలేజ్ అవుట్ రీచ్ సెల్ కన్వీనర్ గా అగ్గాల రామచంద్రరావు ( సురేష్) ని నియమిస్తూ గాజువాక బిజేపి కార్యాలయంలో రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు (కే ఎన్ ఆర్ ) ఆధ్వర్యంలో వారికి నియామక పత్రాలు అందజేసారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజేపి యువ మోర్చా విశాఖ జిల్లా అధ్యక్షులు ఇప్పిలి మూర్తి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు నాయకత్వకంలో బీజేపిలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.

దేశ భవిష్యత్తును వికసిత్ భారత్ గా తిరగరాసే శక్తి యువతకు ఉందని అన్నారు. జాగారపు శ్రీను మాట్లాడుతూ తాను బిజేపి గాజువాక ఇంచార్జ్ కేఎన్ఆర్ ఆహ్వానం మేరకు బిజేపిలో చేరానని అన్నారు. తనపై నమ్మకంతో తనకు ఇచ్చిన పదవికి నూటికి నూరుశాతం న్యాయం చేస్తానని అన్నారు. పార్టీ పెద్దల సూచనలు మేరకు గాజువాకలో అన్ని మండలాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకులను కలసి , యువ మోర్చా మండల అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు.

తన కట్టె కాలే వరకు బిజేపిలోనే ఉంటానని స్పష్టం చేసారు. అగ్గాల సురేష్ మాట్లాడుతూ తన కష్టాన్ని గుర్తించి తనకు జిల్లా స్థాయిలో అవుట్ రీచ్ సెల్ కన్వీనర్ గా పదవి ఇచ్చిన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో ఉన్న విద్యార్థుల్లో దేశ భక్తి, సేవా భావం పెంపొందించేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ , జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ ,సీనియర్ నాయకులు బాటా శ్రీను , జిల్లా కార్యదర్శి సోంబాబు , జిల్లా మీడియా పేనలిస్ట్ గూటూరు శంకరరావు , నాయకులు ఈశ్వరరావు , కేవి రమణ , కృష్ణారెడ్డి , శ్రీను తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story