Madhurawada: కొమ్మాది టిడ్కో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన విజయ్ బాబు

Madhurawada: విశాఖ మధురవాడ కొమ్మాది టిడ్కో ఇళ్ల రోడ్డు నిర్మాణ పనులను భీమిలి టీడీపీ ఇన్‌చార్జ్ చిక్కాల విజయ్ బాబు మంగళవారం ప్రారంభించారు.

JAI RAM, MADURAWADA
Published on: 29 Sept 2026 11:48 PM IST
Madhurawada
X

Madhurawada: కొమ్మాది టిడ్కో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన విజయ్ బాబు

మధురవాడ: కొమ్మాది టిడ్కో గృహ సముదాయానికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను భీమిలి పార్టీ ఇంచార్జ్ చిక్కాల విజయ్ బాబు మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్లను సోమవారం పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు.

కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షుడు గరే గుర్నాథ్, కార్యదర్శి లొడగల జానకిరాం, మొల్లి లక్ష్మణరావు, మన్యాల సోంబాబు, బోయి శ్రీను, రెడ్డి సత్యనారాయణ, పోలిశెట్టి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA