Bheemili: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.20 లక్షల కోట్ల ఒప్పందాలు: గంటా!
Bheemili: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సీఐఐ సమ్మిట్ వేదికగా ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Bheemili: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.20 లక్షల కోట్ల ఒప్పందాలు: గంటా!
భీమిలి, నవంబర్ 12: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సీఐఐ సమ్మిట్ వేదికగా లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న సమ్మిట్ లో గురువారం పాల్గొన్న ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ భీమిలి కేంద్రంగా ఐటీ, టూరిజం, హౌసింగ్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
భీమిలి పరిసరాల్లో గూగుల్, రిలయన్స్ సహా 9 జీబీ సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయన్నారు. అలాగే రాబోయే రెండేళ్లలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సముద్రం, నేషనల్ హైవే కు అనుసంధానంగా ఉన్న భీమిలి నియోజకవర్గం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు.
విశ్వ నగరంగా రూపు దిద్దుకుంటున్న విశాఖకు భారీ ప్రాజెక్టులు తీసుకు రావడంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు.




