Visakhapatnam: విశాఖ కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా: పేషీ హెచ్చరిక!

Visakhapatnam: విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేషీ హెచ్చరించింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 23 Oct 2026 4:57 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా: పేషీ హెచ్చరిక!

విశాఖపట్నం, అక్టోబర్ 23: విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ పేరు, గుర్తింపుతో గుర్తుతెలియని వ్యక్తి నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి, పలువురికి సందేశాలు పంపిస్తూ డబ్బులు కోరుతున్నట్లు కలెక్టర్ పేషీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేషీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.

కలెక్టర్ పేరుతో డబ్బులు కోరుతూ వచ్చే అనుమానాస్పద వాట్సాప్ సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండేలా చూడాలని కలెక్టర్ పేషీ కోరింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.