Visakhapatnam: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన 'అక్వాన్'!

Visakhapatnam: బంగాళాఖాతంలో 'అక్వాన్' తీవ్ర తుపానుగా మారింది. ఎల్లుండి మధ్యాహ్నానికి మచిలీపట్నం-పూరీ మధ్య ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 18 Nov 2026 12:59 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన 'అక్వాన్'!

విశాఖపట్నం: బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్, గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్, ప్రస్తుతానికి ఇది చెన్నైకి 570 కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి 580 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతం, ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి మచిలీపట్నం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఆర్టీజిఎస్ - విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాన్ పయనంపై నిరంతరం పర్యవేక్షణ, తుపాన్ గమనంపై ఎప్పటికప్పుడూ జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు జారీ, అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధం.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.