Visakhapatnam: వాయుగుండం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్లా శ్రీనివాసరావు!

Visakhapatnam: బంగాళాఖాతంలో వాయుగుండం: తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 22 Sept 2026 11:52 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: వాయుగుండం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్లా శ్రీనివాసరావు!

విశాఖపట్నం: దిబ్బపాలెం, గంగవరం, శ్రీనగర్ మత్స్యకార కాలనీ, యారాడ తీర ప్రాంతం, పెదగంట్యాడ జాలారిపేట తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని పల్లా సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హితవు పలికారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారుల భద్రతపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు

తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పల్లా అన్నారు. విద్యుత్‌, రహదారులు, తాగునీరు తదితర సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పల్లా స్పష్టం చేశారు.

ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించి సహకరించాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పల్లా విజ్ఞప్తి చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.