Chodavaram: డిజిటల్ బాటలో విశాఖ గ్రంథాలయాలు: చైర్మన్ సతీష్ కుమార్!
Chodavaram: ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వి. సతీష్ కుమార్ చోడవరంలో కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.
Chodavaram: డిజిటల్ బాటలో విశాఖ గ్రంథాలయాలు: చైర్మన్ సతీష్ కుమార్!
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కేంద్రంలోని కోపరేటివ్ కాలనీ గ్రంథాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ విశాఖపట్టణం యాప్ ను ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వి సతీష్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రంథాలయాలను అప్గ్రేడ్ చేసి పాఠకులకు, విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా డిజిటలైజేషన్ చేస్తున్నామని ఇప్పటికే చాలా శాతం డిజిటలైజ్ చేసామని. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు గ్రంథాలయాల పుస్తక పఠనాన్ని పెంపొందించేందుకు ఈ యాప్ ద్వారా డిజిటల్ గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపొందించారని.
ముఖ్యంగా నిరుద్యోగులకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయంతో గ్రంథాలయాలను మున్ముందు ఇంకా అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని, అందులో భాగంగానే యునెస్కో వారు సుమారు 7 లక్షల పుస్తకాలు జిల్లా గ్రంథాలయ సంస్థకు వితరణ చేశారని వీటి ద్వారా నిరుద్యోగులు కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధం అవ్వాలని అందుకే గ్రంథాలయాలను వినియోగించుకోవాలని నిరుద్యోగులకు పిలుపునిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో చోడవరం సీనియర్ జనసేన నాయకుడు జెర్రిపోతుల నానాజీ మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వి సతీష్ కుమార్ లాంటి యువకుల ఆలోచనలు, ప్రణాళికలు,ఆచరణలు ఎంత ప్రభావం చూపిస్తాయో ప్రస్తుతం ఈ గ్రంథాలయ సంస్థ ద్వారా మనం చూస్తున్నామని, జనసేనలో పెద్ద నాయకులు ఎవరూ లేని సమయంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో తనదైన ముద్రను వేసి జనసేన జెండా ఎగురవేసిన ఘనత సతీష్ కుమార్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గ్రంథాలయ సంస్థకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు చైర్మన్ సతీష్ కుమార్ తీసుకువస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్ కుమార్ తో పాటు చోడవరం సీనియర్ జనసేన నాయకుడు జెర్రిపోతుల నానాజీ, దండుపాటి తాతారావు, మాడుగుల జనసేన నాయకులు వరాహమూర్తి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




