Visakhapatnam: సీఎస్ఆర్ నిధులతో గ్రామాల్లో వెలుగులు నింపిన దివిస్ సంస్థ

Visakhapatnam: భీమిలి మండలంలోని ఐదు పంచాయతీలకు దివిస్ ల్యాబొరేటరీస్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో రూ. 6.75 లక్షల విలువైన ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు, కేబుళ్లను అందజేసింది.

SHIVA, BHIMILI
Published on: 8 Oct 2026 6:47 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: సీఎస్ఆర్ నిధులతో గ్రామాల్లో వెలుగులు నింపిన దివిస్ సంస్థ

Visakhapatnam: దివిస్ లేబరేటరీస్ లిమిటెడ్,చిప్పాడ యాజమాన్యం భీమిలి మండలంలోని అన్నవరం, పెదనాగమయ్యపాలెం, మూలకుద్దు, టీ.నగర పాలెం మరియు చిప్పాడ పంచాయతీల పంచాయతీల కార్యదర్శులకు రు. 6,75,000/- విలువైన ఎల్ ఈ డి స్ట్రీట్ లైట్లు దివిస్ సంస్థ సి ఎస్ ఆర్ మేనేజర్ డి సురేష్ కుమార్ అందచేశారు.

ఈ కార్యక్రమంలో డి.సురేష్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీలలో ఉన్న రోడ్డు మార్గాలలో, వీధులలో మరియు ప్రధాన కూడలిలలో విద్యుత్ దీపాలు వెలగక గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ భయాందోళనలకు గురవుతున్న తరుణంలో పంచాయతీల విన్నపం మేరకు ఎల్ ఈ డి స్ట్రీట్ లైట్లు, సర్వీస్ కేబుల్ మరియు ప్లాస్టర్ పంచాయతీల అభివృద్ధిలో భాగంగా పంచాయతీలకు అందించమన్నారు.

దివిస్ సంస్థ గ్రామాల్లో చేస్తున్న వివిధ రకాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను పంచాయతీ పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పోల్ రెడ్డి, రామచంద్రరావు, గోపాలకృష్ణ మరియు శారద,గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది మరియు సి ఎస్ ఆర్ ప్రతినిధులు ఏ శ్రీనివాస్, పి శేఖర్ బాబు, కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI