Gajuwaka: ఆటో దొంగతనం కేసును ఛేదించిన గాజువాక పోలీసులు!

Gajuwaka: విశాఖపట్నం గాజువాక పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఆటో దొంగతనం కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రూ.2 లక్షల విలువైన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

PRAKASH, GAJUWAKA
Published on: 12 Nov 2026 6:10 PM IST
Gajuwaka
X

Gajuwaka: ఆటో దొంగతనం కేసును ఛేదించిన గాజువాక పోలీసులు!

గాజువాక: విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో గాజువాక పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ఆటో దొంగతనం కేసును ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, చోరీకి గురైన సుమారు రూ.2,00,000/- విలువైన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఫిర్యాదుదారుని వివరాలు:

ముచ్చ రాము, తండ్రి తౌడు, వయస్సు 30 సంవత్సరాలు, కులం ఎస్సీ (మాల), నివాసం: గౌతమి హాస్పిటల్ పక్కన, వంటిల్లు జంక్షన్, గాజువాక, విశాఖపట్నం.

నిందితుడి వివరాలు:

గవర శివకుమార్, తండ్రి అప్పలనాయుడు, వయస్సు 34 సంవత్సరాలు, నివాసం: సనత్ నగర్, వుడా డబుల్ రోడ్, గాజువాక.

కేసు వివరాలు:

గాజువాక పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.435/2026, సెక్షన్ 303(2) BNS.

నేరం జరిగిన తేదీ మరియు సమయం:

05.11.2026వ తేదీ తెల్లవారుజామున సుమారు 04.00 గంటలకు.

నేరం జరిగిన ప్రదేశం:

హరిణి హాస్పిటల్ సమీపంలో, వుడా డబుల్ రోడ్, సనత్ నగర్, గాజువాక.

నేరం జరిగిన విధానం:

ఫిర్యాదుదారుడు తన పసుపు రంగు ప్యాసింజర్ ఆటోను రోడ్డుపై పార్కింగ్ చేయగా, ఆటోకు హ్యాండిల్ లాక్ వేయకపోవడాన్ని గమనించిన నిందితుడు, అదును చూసుకుని ఆటోను దొంగిలించి అక్కడి నుంచి తీసుకువెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుడిని పట్టుకున్న విధానం:

12.11.2026వ తేదీన గాజువాక పరిధిలోని జగ్గు జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఆటోలో వస్తున్న నిందితుడు పోలీసులను గమనించి అనుమానాస్పదంగా వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆటో దొంగతనం చేసినట్లు వెల్లడైంది.

నిందితుడి నేర అంగీకారం మరియు నేర చరిత్ర:

దొంగిలించిన ఆటోను స్క్రాప్ షాపులో విక్రయించడానికి తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు.

నిందితుడిపై గతంలో మొత్తం ఏడు కేసులు ఉన్నట్లు గుర్తించబడింది.

గాజువాక పోలీస్ స్టేషన్‌లో కూడా నిందితుడి వివరాలు సస్పెక్ట్‌గా నమోదై ఉన్నట్లు గుర్తించబడింది.

స్వాధీనం చేసుకున్న ఆస్తి వివరాలు:

వాహనం: ప్యాసింజర్ ఆటో.

కంపెనీ: ALFA.

రంగు: పసుపు రంగు, నలుపు రంగు టాప్.

రిజిస్ట్రేషన్ నంబర్: AP30TC2155.

ఇంజిన్ నంబర్: A8B1171335.

చాసిస్ నంబర్: MA1LE2FXSJ3B24639.

అంచనా విలువ: రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయలు).

పోలీసుల దర్యాప్తు మరియు సిబ్బంది పనితీరు:

గాజువాక పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. CH. హరికృష్ణ గారు సిబ్బంది సహకారంతో కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి విశ్లేషించడం ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చోరీకి గురైన ఆటోను స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ప్రత్యేక అభినందనలు:

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్‌లను సమర్థవంతంగా సేకరించి, విశ్లేషించి, నిందితుడిని గుర్తించడంలో అత్యంత ప్రతిభావంతంగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ నా. చంద్రశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది విశాఖపట్నం సిటీ పోలీసుల ప్రజలకు విజ్ఞప్తి:

వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ మరియు ఇతర భద్రతా పరికరాలను ఉపయోగించాలి.

వాహనాలను నిర్లక్ష్యంగా, తాళాలు వేయకుండా రోడ్లపై పార్కింగ్ చేయకూడదు.

వీలైనంత వరకు సీసీటీవీ కెమెరాలు మరియు నిఘా ఉన్న ప్రదేశాలలోనే వాహనాలను పార్కింగ్ చేయాలి.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ *112* కు కాల్ చేయాలి.

విశాఖపట్నం సిటీ పోలీస్ ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు మరియు ప్రజల ఆస్తుల రక్షణకు నిరంతరం కృషి చేస్తున్నాము. సీఐ G.D. బాబు, సౌత్ సబ్-డివిజన్ క్రైమ్ బ్రాంచ్ విశాఖపట్నం సిటీ పోలీస్.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA