Visakhapatnam: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి గంటా శ్రీనివాసరావు
Visakhapatnam: మధురవాడ గ్రీన్ డేల్ స్కూల్ స్టూడెంట్ ఎల్ఈడీ కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు; విద్యార్థుల సృజనాత్మకత, నమూనాలపై ప్రశంసలు.
Visakhapatnam: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి స్కూల్ యాజమాన్యాలు కృషి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ గ్రీన్ డేల్ స్కూల్లో శనివారం జరిగిన స్టూడెంట్ ఎల్.ఈ.డి. కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే పాఠ్యాంశాలతో పాటు సామాజిక బాధ్యత, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎల్.ఈ.డి. కాన్ఫరెన్స్ ల ద్వారా విద్యార్ధుల ప్రగతి గురించి తల్లిదండ్రులు తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు.
తాను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గ్రీన్ డేల్ స్కూల్ విశాఖలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన అందించే స్థాయికి చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సైన్స్, కంప్యూటర్ తదితర అంశాలపై అభివృద్ధి చేసిన నమూనాలను చూసిన గంటా విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. కార్యక్రమంలో గ్రీన్ డేల్ యాజమాన్య ప్రతినిధులు సుంకర రాజేంద్ర, దివ్య, తేజ తదితరులు పాల్గొన్నారు.




